![]() |
![]() |

బుల్లితెర మీద జెస్సి అలియాస్ జెశ్వంత్ ఒకప్పుడు బాగా ఫేమస్. జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఢీ షోలో కనిపించేవాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్ళాడు. అతనో ఫ్యాషన్ డిజైనర్.. ర్యాంప్ వాకర్.. మోడలింగ్.. ఫ్యాషన్.. యాక్టింగ్ పై ఇంటరెస్ట్ తో ముందుగా మోడలింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. బెంగుళూరులో జరిగిన కొన్ని ఫ్యాషన్ షోలలో పాల్గొని అవార్డ్స్ తీసుకున్నాడు. మిస్టర్ ఏపీ ట్రెడిషనల్ ఐకాన్‌గా ఎంపిక అయ్యాడు. ఆ తరువాత మోడల్ హంగ్ సీజన్ 2 విజేత అయ్యాడు. అలాంటి జెస్సి కొంత కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ పేజీలో మాత్రం అప్డేట్స్ పెడుతూనే ఉన్నాడు.

ఇక లవర్స్ డే సందర్భంగా ఒక రీల్ చేసాడు. "ఫ్రెండ్స్ పండగ చేసుకుందాం అంటే నాకు లవర్ లేరు. మీకు లవర్ ఉంటే పండగ చేసుకోండి ఫ్రెండ్స్. చూడని నా బాధ ఎలా ఉందో" అంటూ ఉన్న రీల్ అది. లవర్ లేదని చెప్తూనే సమంతని చూపిస్తూ ఆ పిక్ ని నెమలి పింఛాలతో తడుముతూ "లవ్ యు సామ్" అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక నెటిజన్స్ ఊరుకుంటారా "సమంత మేడం గనక చూస్తే ఎగిరి తంతాది బ్రో జాగ్రత్త" అంటున్నారు. ఫ్యాషన్ రంగంలో తిరుగులేని పేరు సంపాదించిన జస్వంత్‌కి యాక్టింగ్ అంటే మక్కువ ఉండటంతో.. 2017లో జెమిని టీవీ సప్త మాత్రిక సీరియల్‌తో నటనలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 2020లో ‘ఎంతమంచి వాడవురా’ సినిమాలో నటించాడు.
![]() |
![]() |